Header Banner

కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన పెనుప్రమాదం! పరిస్థితి ఎలా ఉందంటే..?

  Wed Mar 12, 2025 19:49        Politics

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు ప్రమాదం(Car Accident)లో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ (Bhupathi Raju Srinivasa Varma) గాయపడ్డారు. రెండు కార్లు ఢీకొని తృటిలో ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షెడ్యూల్ ప్రకారం కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఇవాళ (బుధవారం) సాయంత్రం విజయవాడ రావాల్సి ఉంది. ఈ మేరకు పార్లమెంట్ భవనం (Parliament Building) దగ్గరలోని విజయ్ చౌక్ నుంచి ఎయిర్‍పోర్టుకు ఆయన కారులో బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఓ వాహనాన్ని తప్పించబోయిన కేంద్రమంత్రి డైవర్.. సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో ఎదురుగా వస్తున్న మరో కారును శ్రీనివాసవర్మ వాహనం ఢీకొట్టింది. సడెన్ బ్రేక్ వేయడంతో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ తల, కాలుకు స్వల్పగాయాలు అయ్యాయి. డ్రైవర్‍కు మాత్రం ఎలాంటి గాయాలూ కాలేదు. ఈ ప్రమాదంతో కాసేపు ఆందోళనకు గురైన కేంద్రమంత్రి అనంతరం తేరుకుని అదే కారులో విమానాశ్రయానికి చేరుకున్నారు. సాయంత్రం 05:30 గంటల సమయానికి విమానం ఎక్కి విజయవాడ బయలుదేరారు. విజయవాడలో గురువారం జరిగే ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పాల్గొననున్నారు. మరోవైపు శ్రీనివాసవర్మకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న బీజేపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు.

ఇది కూడా చదవండివర్రా కేసులో కీలక మలుపు! సెంట్రల్ జైలు వద్ద పోలీసుల హైఅలర్ట్!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


గత ప్రభుత్వంలో మహిళలకు న్యాయం లేదు.. నాపైనే 23 కేసులు! హోంమంత్రి ఘాటు వ్యాఖ్యలు!

టీటీడీకి భారీ విరాళాలు! తిరుమల అన్నప్రసాద సేవలో విప్లవాత్మక మార్పులు!


అమరావతి అభివృద్ధికి భారీ నిధులు.. చంద్రబాబు నేతృత్వంలో కీలక భేటీ! కోట్ల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్!


రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఘర్షణ! అసెంబ్లీలో కీలక ప్రకటన!


జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత కీలక షెడ్యూల్ విడుదల! ఏ పరీక్ష ఏయే తేదీల్లో అంటే!


ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్... రాజమండ్రి సెంట్రల్ జైలుకు రౌడీషీటర్ ఎంట్రీ! ముగిసినా అజ్ఞాతం!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #rajadhani #unioinminister #accident #todaynews #flashnews #latestnews